JN:మత్స్యకార రైతులు కొరమీను చేపల పెంపకంపై ఆసక్తి చూపి ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్ అన్నారు. స్టేషన్ ఘన్పూర్‌లో ఈరోజు రైతు వేదికలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆధునిక సాగు పద్ధతులతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చన్నారు. చేపల ఆహారం, వ్యాధుల నివారణతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
'కొరమీను చేపల పెంపకంతో అధిక లాభాలు'


