NZB: బోధన్ మండలం సిద్దాపూర్లో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్నేలి నుంచి బోధన్ వైపు వెళ్తున్న RTC బస్సు నుంచి సిద్దాపూర్‌లో దిగుతుండగా శేషబాయి అనే మహిళ ప్రమాదవశాత్తు బస్సు కిందపడింది. ఈ ఘటనలో ఆమె మృతిచెందింది. ప్రయాణికురాలు దిగుతున్న సమయంలో డ్రైవర్ బస్సును ఆపకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. న్యాయం కోసం బస్సు ముందు ధర్నా చేశారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. ధర్నా


