JN: బచ్చన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికలోని న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆశయాలను వివరించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలు, హక్కులు, బాధ్యతలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'


