హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈనెల సత్తుపల్లిలో 29న దీక్షా దివాస్'

KMM: సత్తుపల్లిలో ఈనెల 29న మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి, వేంసూరు మండలాలతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.