BHPL: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28న కాటారంలోని చింతకాని క్రాస్ వద్ద జిల్లాస్థాయి 'క్రాస్‌కంట్రీ' ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి పి.సమ్మయ్య తెలిపారు. అండర్-16, 18, 20 బాలబాలికలు, యువతీ యువకులకు 2 నుంచి 10 కి.మీ. వరకు పరుగు పందెం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు జనన ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 8 గంటలకు హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 28న జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు


