హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు

ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించిన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.