హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏర్రాబాలెంలో అంగన్వాడీ టీచర్ ఇంటిపై దాడి

GNTR: మంగళగిరి(M) ఏర్రాబాలెంలో ఒక అంగన్వాడీ టీచర్ నివాసంపై దాడి జరిగింది. నాగేంద్రస్వామి పుట్టరోడ్డు సమీపంలోని ఆమె రేకుల ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు వేసినట్లు తెలుస్తోంది. చిన్న వానకే గది నిండా వర్షపు నీరు చేరడంతో ఆమె ఈ విషయాన్ని గుర్తించారు. గతంలో భారీ వర్షాలకు సైతం నీరు రాలేదని, కావాలనే కక్షతో దాడి చేశారని బాధితురాలు తెలిపారు.