హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్జిల్‌లో బస్టాండ్ నిర్మాణం ఎప్పుడో?

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో బస్టాండ్, మౌలిక వసతుల కల్పనపై నాయకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని స్థానికులు, చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించి, ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ భూమిపూజ చేసి నెలలు గడుస్తున్నా పనుల్లో కదలిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు.