హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

కోనసీమ: కాట్రేనికోన మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను డీఎస్పీ గురువారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.