హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరం నియోజకవర్గంలో తరలివస్తున్న ఓటర్లు

ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 54 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పర్యవేక్షిస్తున్నారు.