అన్నమయ్య: సంబేపల్లెలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించి, తమ అభ్యర్థిని అడ్డుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. సర్పంచ్ అభ్యర్థి యశోదమ్మను పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రానికి తాళం వేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో అభ్యర్థులు, ఏజెంట్లను పోలీసులు స్టేషన్కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
సంబేపల్లెలో ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం


