VSP: పంచదార లోడుతో వెళుతున్న లారీ శోంఠాం వద్ద బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గుంటూరు పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన చల్ల ఆదినారాయణ గుంటూరు నుంచి పంచదార లోడుతో విజయనగరం వెళ్తుండగా శోంఠాం హైవేపై కల్వర్టు వద్ద బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం ట్రాఫిక్ ఎస్సై పాపారావు సంఘటన స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి


