హైదరాబాద్: 28°C
తెలంగాణ

డయల్ 100కు రాంగ్ ఇన్ఫర్మేషన్.. జైలు శిక్ష!

HYD: డయల్ 100కు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసుల సమయాన్ని వృథా చేసిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది. కీసరకు చెందిన వెంకటేశ్ మద్యం మత్తులో హత్య జరుగుతోందంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో 3 గంటలపాటు పోలీసులు గాలింపు చేపట్టారు. సమాచారం తప్పు అని తేలడంతో కేసు నమోదు చేసి కోర్టులో విచారించిన న్యాయస్థానం నిందితుడికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు.