హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

NRML: జిల్లా పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. గత 3 నెలల్లో 15 కేసులు నమోదయ్యాయని, బాలికలపై అసభ్యకర ప్రవర్తన తీవ్ర నేరమని తెలిపారు. 'పోలీస్ అక్క' కార్యక్రమం ద్వారా కేజీబీవీ విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నామని, బాలల రక్షణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.