హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగవరంలో కొనసాగుతున్న పోలింగ్

CTR: గంగవరం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం నుంచి ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.