హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో ఎన్నికల వేళ ఉద్రిక్తత

అన్నమయ్య: సంబేపల్లి మండల కేంద్రంతో పాటు రౌతుకుంటలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులు అనుమతించలేదంటూ వైసీపీ మద్దతు ఏజెంట్లు, నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు రౌతుకుంటలో తమ అభ్యర్థి కనిపించడం లేదంటూ గ్రామస్థులు సీఐని నిలదీశారు. పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.