హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయం 6 గంటల నుంచే బారులు తీరిన ఓటర్లు

NTR: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే పలుచోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు, రామవరప్పాడులో ఉదయాన్నే ఓటర్ల సందడి కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.