హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

AKP: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సందర్శించి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సదుపాయాలను సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.