WNP: శ్రీరంగాపురం మండలం వెంకటాపూర్ గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరగడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వాహనదారులు, చిన్నారులు, వృద్ధులపై దాడి చేస్తాయేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
వెంకటాపూర్లో వీధి కుక్కల బెడద


