నెల్లూరు: వెంకటాచలం మండలం చెముడు గుంట ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి కనిగిరికి ఓటు వేసేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కొండా శ్రీనివాసులు, తల్లి కోటేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు పవన్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు వేసేందుకు వస్తూ దంపతులు మృతి...!


