హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కరీంనగర్ నగరపాలక సంస్థలోని బొమ్మకల్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. సారయ్యకు రూ.1.40 లక్షలు, శ్రీనివాస్‌కు రూ.57 వేల చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, మార్కెట్ వైస్ ఛైర్మన్ తదితరులు ఉన్నారు.