TPT: పర్మిట్ లేకుండా క్యాబ్‌లు, ఆటోరిక్షాలు నడిపితే మోటారు వాహన చట్టం సెక్షన్ 192ఏ కింద కేసులు నమోదు చేసి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు పర్మిట్ తప్పనిసరిగా పొందాలని సూచించారు. పర్మిట్ లేకుండా ప్రమాదం జరిగితే బీమా క్లెయిమ్‌లో ఇబ్బందులు రావచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
పర్మిట్ లేని వాహనాలపై కేసులు, జరిమానా!


