హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిట్వేల్ మండలంలో ప్రశాంతంగా పోలింగ్

అన్నమయ్య: చిట్వేల్ మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.