హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాయితీ చాటుకున్న పరకాల ఆర్టీసీ కండక్టర్

HNK: పరకాల బస్టాండ్‌లో ప్రయాణికుడు మరిచిపోయిన రూ.15 వేల నగదు, ప్లాట్ల డాక్యుమెంట్లతో కూడిన బ్యాగును ఆర్టీసీ కండక్టర్ స్వామి తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. బుధవారం హనుమకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న బస్సులో నడికూడ మండలం ముస్త్యాలపల్లికి చెందిన రేషన్ డీలర్ ఆనందం బ్యాగ్ మరిచిపోగా, దానిని గుర్తించి అధికారుల సమక్షంలో బాధితుడికి అప్పగించారు.