SDPT: గజ్వేల్ ఆర్టీసీ డిపోలో గురువారం 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ బద్రినారాయణ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు 9959226270 నంబర్‌కు ఫోన్ చేసి బస్సుల రాకపోకలు, ప్రయాణ సమస్యలు, సూచనలను నేరుగా తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఆర్టీసీ డిపోలో నేడు 'డయల్ యువర్ డీఎం'


