కోనసీమ: పుల్లేటికుర్రు జడ్పీహెచ్ స్కూల్‌లో బుధవారం ఓ యువకుడు మద్యం సేవించి తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వచ్చాడు. హైస్కూల్లో తరగతి గదుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. దీంతో ఆ యువకుడు ఉపాధ్యాయులపై దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్లో మద్యం సేవించి యువకుడి వీరంగం


