హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సుల తరలింపు

కోనసీమ: రాజోలు మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం జరగనున్న ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం రాజోలులో ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 202 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు సామగ్రితో తరలివెళ్లారు.