హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేగులమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ వేగులమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.