హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాత్‌రూమ్‌లో జారిపడి వ్యక్తి మృతి

MDK: నిజాంపేట మండలం చల్మెడకు చెందిన బొమ్మెన బాబు (35) బుధవారం ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలుజారి పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించే ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బాబు ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.