హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

ADB: గుడిహత్నూర్‌కు చెందిన సోలంకి మహేష్ అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించి 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు SI శ్రీకాంత్ బుధవారం తెలిపారు. గ్రామ అభివృద్ధి పేరుతో ఆరుగురు వీడీసీ సభ్యులు రూ.15 వేలు వసూలు చేసినట్లు తేలిందన్నారు. దీంతో నిర్వాహకుడితో పాటు ఆరుగురు వీడీసీ సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.