హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీసీలు అందరూ ఏకం కావాలి: మంత్రి

NRPT: బీసీలు అందరూ ఏకం కావాలని మక్తల్ MLA, మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కే వరకు పోరాడాలని, పార్టీలకు అతీతంగా బీసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు.