హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో పీఓ, ఏపీఓలకు శిక్షణ తరగతులు

ఏలూరు: ఉంగుటూరు మండలంలో ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పీఓ, ఏపీఓలకు శిక్షణ తరగతులను మంగళవారం ఉంగుటూరు ఎంఈఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మనోజ్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పారదర్శకంగా, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.