SRPT: మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ కె. నరసింహా అన్నారు. మహిళలు భయం లేకుండా, గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మహిళలపై వేధింపులు, వివక్ష, హింసను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మహిళల హక్కులను గౌరవిస్తూ, వారికి అండగా నిలవాలని సూచించారు.
తెలంగాణ
మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ


