హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పద్మావతి బాధ్యతలు

AKP: నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని 40 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నర్సీపట్నాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామన్నారు.