హైదరాబాద్: 28°C
తెలంగాణ

కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రారంభించిన విప్

SRCL: వేములవాడ పట్టణంలో బుధవారం ది సిరిసిల్ల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ను వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడలో బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కోపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.