హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే

BDK: పినపాక మండలంలో అభివృద్ధి కార్యక్రమాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద స్థానికులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలు, గ్రామాల్లో అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.