హైదరాబాద్: 28°C
వార్తలు

సౌదీపై హౌతీల దాడిని ఖండించిన భారత్

సౌదీ అరేబియా రియాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై హౌతీలు జరిపిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో సహా మొత్తం 11 మంది గాయపడినట్లు వెల్లడించింది. ఇలాంటి దాడులు సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని, సౌదీ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తాయని, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. వెంటనే దాడులను ఆపాలని డిమాండ్ చేసింది.