AKP: రావికమతం మండలం దొండపూడి వద్ద బీఎన్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. గర్భిణీలు సైతం ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు తెలిపారు. అధికారులు తక్షణమే గుంతలు పూడ్చి, రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రోడ్డుపై తక్షణమే గుంతలను పూడ్చాలి'


