హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

BDK: అశ్వాపురం మండలంలోని ఎస్సీ కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ భవనం నిర్మాణం, స్మశాన వాటికకు రహదారి, సైడ్ డ్రైనేజీల ఏర్పాటు చేపట్టాలని కోరారు. సమస్యలను పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.