హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆమదాలవలసలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 28 వార్డుల పరిధిలో 33,067 మంది ఓటర్లు ఉండగా, 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు కమిషనర్ రవి బుధవారం తెలిపారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.