హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య విద్యార్థినికి మంత్రి పొంగులేటి ఆర్థిక భరోసా

KMM: నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని రిషితకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక భరోసా కల్పించారు. వైద్య విద్య పూర్తయ్యే వరకు ఏటా ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తొలివిడతగా రూ.50 వేల చెక్కును అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మంత్రి సహాయానికి విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది.