హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరణి బియ్యం అమ్మకాలు ప్రారంభం

AKP: గొలుగొండ మండలం జానకిరాంపురంలో ధరణి రైస్ విక్రయ కేంద్రాన్ని తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఉలబాల శ్రీనివాసరావు ప్రారంభించారు. 26 కిలోల బియ్యం బ్యాగ్‌ను రూ.1,274కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతగా 10 టన్నుల బియ్యం అందుబాటులో ఉంచామన్నారు. ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించి బియ్యం పొందాలని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.