హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై ఏఈవో సూచనలు

ASF: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని బూరుగూడ ఏఈఓ ముత్యం తిరుపతి సూచించారు. ఆసిఫాబాద్ మండలం రావుటసంకేపల్లి, అడ్డఘాట్ గ్రామాల రైతులకు జొన్న, పెసర, మినుము, శనగ పంటల సాగు, భూమి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.