SRPT: భూమి కోసం తండ్రి చనిపోయాడని ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించిన ఘటన తుంగతుర్తి మండలం సూర్యాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఓ రైతు రెండెకరాల భూమిని తన పేరు మీద ఉంచుకొని మిగతాది కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఆ భూమిని తన అక్కా చెల్లెళ్లకు రాస్తాడనుకొని.. 2021లో తండ్రి మరణించాడని ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. తాజాగా ఆ భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. భూమి తనపేరు మీద లేదని ఆరా తీసిన తండ్రికి.. అసలు విషయం తెలిసి నివ్వెరపోయాడు.
తెలంగాణ
ఆస్తి కోసం తండ్రి చనిపోయినట్లు నకిలీ సర్టిఫికెట్


