హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంపూర్తిగా స్పీడ్ బ్రేకర్ల పనులు.. ప్రజల అవస్థలు

GDWL: కొత్త రాజోలిలో స్పీడ్ బ్రేకర్ల నిర్మాణం కోసం తవ్విన రోడ్డును అధికారులు సగం పనితోనే వదిలేశారు. నెల రోజులు గడిచినా పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.