హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు వద్ద నిరుపయోగంగా ఓపెన్ జిమ్

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు నిర్వహణ లోపంతో దెబ్బతిన్నాయి. వ్యాయామ పరికరాలు తుప్పుపట్టి, కొన్ని విరిగిపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో నిత్యం వాకింగ్, వ్యాయామానికి వచ్చే పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.