హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై సర్పంచ్ అసంతృప్తి

MBNR: మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సర్పంచ్ చంద్రయ్య గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఎంపిక చేపట్టడంపై అధికారులను నిలదీశారు. గ్రామ ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తూ, అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్లు కేటాయించాలని సూచించారు.