MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని 12వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఉప సర్పంచ్ మమతా మన్యం, వార్డు సభ్యురాలు భారతి హరి గౌడ్ చొరవ తీసుకుని కొత్త బోరు ఏర్పాటు చేయించారు. దీంతో వార్డు ప్రజలకు నీటి ఎద్దడి నుంచి ఉపశమనం లభించింది. తమ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ప్రజాప్రతినిధులపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
వార్డులో తీరిన తాగునీటి సమస్య


