హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచారామ క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సు

SRCL: పంచారామ క్షేత్రాల సందర్శనకు సిరిసిల్ల డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డీఎం భరతకుమార్ వెల్లడించారు. ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలను దర్శించుకోవచ్చన్నారు. టికెట్ ధర రూ.2,800గా నిర్ణయించారు. వివరాలకు 90634 03971, 99592 25929 నంబర్లను సంప్రదించాలని కోరారు.