హైదరాబాద్: 28°C
తెలంగాణ

13వ శతాబ్దపు పంచముఖి శివుడి విగ్రహం లభ్యం

NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో అరుదైన పంచముఖి శివుడి విగ్రహం వెలుగులోకి వచ్చింది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మంగళవారం ఆలయాన్ని సందర్శించి ఈ విగ్రహాన్ని పరిశీలించారు. ఇది 13వ శతాబ్దానికి చెందిన శిల్పమని, దీనిపై నాగుపడగలు, జటామకుటాలు ఉండటం విశేషమని ఆయన తెలిపారు.